Donald Trump: ఇదంతా జార్జ్ పైనుంచి చూస్తూనే ఉంటాడు: ట్రంప్ వ్యాఖ్యలతో అయోమయం

Trump comments confuse media in the wake of Geotge Floyd issue
  • ఇటీవల పోలీసు అధికారి కారణంగా జార్జ్ ఫ్లాయిడ్ మృతి
  • అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు
  • ఇవాళ ఎంతో సుదినం అన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యభరితంగా చేసిన తాజా వ్యాఖ్యలు అందరినీ అయోమయంలో ముంచెత్తాయి. ఇటీవల పోలీసు అధికారి కారణంగా మృత్యువాత పడిన ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ అంశంపై ట్రంప్ స్పందించారు. జార్జ్ ఫ్లాయిడ్ కు ఇవాళ ఎంతో సుదినం అని వ్యాఖ్యానించారు.  

"దేశంలో ఇప్పుడు జరుగుతున్నదంతా జార్జ్ ఫ్లాయిడ్ పైనుంచి చూస్తూ... మనదేశానికి ఎంతో మంచి జరుగుతోంది అని చెబుతాడేమో!" అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఓవైపు దేశం అట్టుడికిపోతున్న వేళ సమానత్వ పరంగా ఇది నిజంగా, మహాగొప్ప దినం అంటూ ట్రంప్ అభివర్ణించడం మీడియాను విస్మయానికి గురిచేసింది.  ఇది జార్జ్ ఫ్లాయిడ్ కు ఎలా మంచిరోజు అవుతుందని మీడియా వర్గాలు గందరగోళానికి గురయ్యాయి.
Donald Trump
George Floyd
Media
Confusion
USA

More Telugu News