Salman Khan: నిసర్గ తుపాను కారణంగా పాడైన ఫార్మ్ హౌస్ ను స్వయంగా శుభ్రం చేసిన సల్మాన్ ఖాన్

Salman Khan cleans his farm house after beaten by Nisarga
  • మహారాష్ట్రపై ప్రభావం చూపిన నిసర్గ తుపాను
  • అలీబాగ్ వద్ద తీరం దాటిన నిసర్గ
  • సల్మాన్ ఫామ్ హౌస్ లో భారీగా పేరుకుపోయిన చెత్త
నిసర్గ తుపాను మహారాష్ట్రపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. అలీబాగ్ వద్ద తీరం చేరిన నిసర్గ ధాటికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్ లో భారీగా చెత్త పేరుకుపోయింది. లాక్ డౌన్ కారణంగా పన్వేల్ లోని తన ఫామ్ హౌస్ కే పరిమితమైన సల్మాన్... తుపాను శాంతించగానే తన ఫామ్ హౌస్ లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా శుభ్రం చేశాడు. ఈ పనిలో సల్మాన్ కు మిత్రులు కూడా సాయం చేశారు. వారు కూడా చీపుర్లు పట్టి శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు.
Salman Khan
Cyclone Nisarga
Farm House
Clean

More Telugu News