Coffee Day Siddhartha: కాఫీ డే సిద్ధార్థ తనయుడికి , కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ కుమార్తెకు పెళ్లి!

Celebrity wedding bells to be ring soon in Karnataka
  • వివాహంతో ఒక్కటి కానున్న అమర్త్య హెగ్డే, ఐశ్వర్య
  • జూలై 31 తర్వాత పెళ్లి తేదీ నిర్ణయిస్తామన్న శివకుమార్
  • గతేడాది ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే సిద్ధార్థ
దేశంలో మరో సెలబ్రిటీ వివాహానికి రంగం సిద్ధమవుతోంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తనయ ఐశ్వర్యకు, కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత వీజీ సిద్ధార్థ తనయుడు అమర్త్య హెగ్డేలకు త్వరలోనే పెళ్లి జరగనుంది. శివకుమార్ తనయ ఐశ్వర్య వయసు 22 ఏళ్లు. బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న ఆమె తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక వ్యాపార కుటుంబంలో జన్మించిన అమర్త్య అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం వ్యాపార రంగంలోనే ఉన్నారు.

కాగా, 2019లో కాఫీ డే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్థార్థ బతికున్నప్పుడే ఈ పెళ్లి ప్రస్తావన వచ్చిందని డీకే శివకుమార్ తెలిపారు. జూలై 31 నాటికి సిద్ధార్థ మరణించి ఏడాది అవుతుందని, ఆ తర్వాత పెళ్లి తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు. సిద్ధార్థ ఎవరో కాదు... మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడే. ఎస్ఎం కృష్ణను అటు డీకే శివకుమార్ తన మార్గదర్శి అని చెబుతుంటారు.
Coffee Day Siddhartha
Amarthya
DK Shivkumar
Aishwarya
Wedding
Karnataka

More Telugu News