India: వందేభారత్ మిషన్ మూడో విడతకు 337 విమానాలు సిద్ధం!

Vande Bharat Mission 3rd phase will start from 10th june
  • రెండు విడతల ద్వారా 1,07,123 మంది 
  • సరిహద్దు ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల ద్వారా 32 వేల మంది భారత్‌కు
  • ఈ నెల 10న ప్రారంభం కానున్న మూడో విడత
లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ‘వందేభారత్ మిషన్’ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే  రెండు విడతలు ముగిశాయి. ఈ రెండు విడతల ద్వారా ఇప్పటి వరకు 1,07,123 మంది స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 17,485 మంది వలస కార్మికులు, 11,511 మంది విద్యార్థులు, 8,633 నిపుణులు ఉన్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.

ఇక, జూన్ 10న ప్రారంభం కానున్న మూడో విడత మిషన్‌లో భాగంగా 31 దేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 38 వేల మందిని 337 విమానాల ద్వారా స్వదేశానికి తరలించనున్నారు. వీటిలో 54 విమానాలు అమెరికా, 24 కెనడా, నైజీరియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, కెన్యా, సీషెల్స్, మారిషస్ నుంచి 11 విమానాలు రానున్నాయి. మరోవైపు, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ నుంచి సరిహద్దు ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల ద్వారా దాదాపు 32 వేల మంది భారత్ చేరుకున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు.
India
Vande Bharat Mission
3rd phase

More Telugu News