Tamilnadu: ఉచితంగా మాస్క్ లు పంచాడు... కరోనా బారిన పడ్డాడు!

corona positive for youth who Distributes Masks
  • తమిళనాడులోని తంజావూరులో ఘటన
  • చెన్నైకి వచ్చి మాస్క్ లు పంచిన యువకుడు
  • అనారోగ్యం బారిన పడగా పరీక్షలు
పక్క వాళ్లకు సాయం చేయాలని చూసిన ఓ వ్యక్తి ఇబ్బందుల పాలయ్యాడు. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ, ప్రజలకు మాస్క్ లను ఉదారంగా పంచిన ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ జిల్లా వవూసి నగర్ ప్రాంతంలో జరిగింది.

ఇక్కడి 'మక్కల్ పాదై' స్వచ్ఛంద సంస్థ తరపున ఓ యువకుడు చెన్నైకి వెళ్లి, కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు ఉచితంగా మాస్క్ లను అందించాడు. ఆపై అతను తిరిగి తంజావూరు వెళ్లిన తరువాత, అనారోగ్యం బారిన పడగా, విషయం తెలుసుకున్న వైద్యులు నమూనాలను పరీక్షించగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కాగా, ఇప్పటివరకూ ఆ జిల్లాలో 112 మందికి వైరస్ సోకగా, 88 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Tamilnadu
Corona Virus
Masks

More Telugu News