తెలుగు ఐఏఎస్ అధికారికి అమెరికాలో కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం
- అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా నియామకం
- భారత ఎంబసీలో సంయుక్త కార్యదర్శి హోదా
- మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న రవి కోట
కాగా, రవి కోట వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో వ్యవహరించనున్నారు. తన విధుల్లో భాగంగా భారత్ తరఫున ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి), వరల్డ్ బ్యాంకు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. రవి కోట మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.