శ్రీలంక క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం... ముగ్గురు మాజీ క్రికెటర్లపై ఐసీసీ విచారణ
గత కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ ను ఫిక్సింగ్ భూతం వెంటాడుతోంది. తాజాగా శ్రీలంక క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం రేగింది. ముగ్గురు క్రికెటర్లపై ఐసీసీ విచారణ షురూ చేసింది. ఈ విషయంలో లంక క్రీడల మంత్రి దుల్లాస్ అలహపెరుమ స్పందిస్తూ, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ముగ్గురు క్రికెటర్లు ఐసీసీ విచారణ ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిపై శ్రీలంక బోర్డు వివరణ ఇస్తూ, ఆ ముగ్గురిలో ప్రస్తుత జాతీయ జట్టుకు ఆడుతున్న వారెవరూ లేరని, విచారణ ఎదుర్కొంటున్నది మాజీ ఆటగాళ్లని స్పష్టం చేసింది. కాగా, ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరన్నది లంక క్రీడల మంత్రి వెల్లడించలేదు.