elephant: కేరళలో కలకలం.. మరో ఆడ ఏనుగును చంపేసిన వైనం!

  • కొల్లం జిల్లా పతానపురం అటవీ ప్రాంతంలో ఘటన
  • పేలుడు పదార్థాలు తినడంతో చనిపోయిందని అనుమానాలు
  • పోస్టు మార్టం నివేదిక వచ్చిందన్న అధికారులు
  • దాని దవడ విరిగినట్లు వివరణ
కేరళలోని మలప్పురంలో ఓ ఆడ ఏనుగును కొందరు దారుణంగా చంపిన ఘటనను మరవక ముందే అదే రాష్ట్రంలోని కొల్లం జిల్లా పతానపురం అటవీ ప్రాంతంలో మరో ఏనుగు మృతి కలకలం రేపుతోంది. మలప్పురంలో టపాసులతో నింపిన పైనాపిల్ ఇవ్వడంతో ఏనుగు చనిపోయిన విషయం తెలిసిందే.

పతానపురం అటవీ ప్రాంతంలో చనిపోయిన ఏనుగు కూడా అదే విధంగా చనిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. తాము రెండు నెలల క్రితం బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగును చూశామని, దాన్ని రక్షించి వైద్యం చేయాలని ప్రయత్నించగా అది సహకరించకుండా కొద్ది దూరం నడిచివెళ్లిపోయిందని అధికారులు చెప్పారు.

తర్వాతి రోజు అది  ఓ ప్రాంతంలో చనిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. తాజాగా పోస్టు మార్టం నివేదిక వచ్చిందని, దాని దవడ విరిగినట్లు తేలిందని వివరించారు. ఈ ఏనుగు కూడా  పేలుడు పదార్థం తినడం వల్లే చనిపోయుండొచ్చని భావిస్తున్నారు. తాము ప్రస్తుతం వైద్య పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
elephant
Kerala

More Telugu News