Actress Sneha: రూ. 70 వేల విద్యుత్ బిల్లు పంపి సినీ నటి స్నేహ భర్తకు షాకిచ్చిన విద్యుత్ బోర్డు

Tamil Nadu Electricity Board shocks Actor Prasanna
  • బిల్లు చూసి మండిపడిన నటుడు ప్రసన్న
  • ఇలాంటి బిల్లే పేదలకు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్న
  • మీటరు రీడింగులో తప్పులు దొర్లాయన్న విద్యుత్ బోర్డు
ప్రముఖ సినీ నటి స్నేహ భర్త, తమిళ నటుడు అయిన ప్రసన్నకు తమిళనాడు విద్యుత్ బోర్డు షాకిచ్చింది. ఒక నెలకు ఏకంగా రూ.70 వేల బిల్లు పంపి విస్తుపోయేలా చేసింది. ప్రసన్న, ఆయన తండ్రి, మామగారి ఇళ్లకు మొత్తంగా రూ. 70 వేల బిల్లు పంపిన బోర్డు.. వెంటనే చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది.

బిల్లు చూసి షాకైన ప్రసన్న విద్యుత్ బోర్డుపై మండిపడ్డారు. తానైతే రూ. 70 వేలు చెల్లించగలనని, కానీ ఇదే బిల్లు పేదల ఇంటికి వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నిజానికి తమకు రెండు నెలలకు కూడా ఇంత బిల్లు రాదని, సాధారణంగా వచ్చే బిల్లుకు ఎన్నో రెట్లు ఎక్కువగా బిల్లు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 70 వేలు బిల్లు పంపిన విషయంపై విద్యుత్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. రెండు నెలలకు పైగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మీటరు రీడింగులో తప్పులు దొర్లాయన్నారు. ప్రసన్న ఇంటికి పంపిన బిల్లును సరిచేసి మళ్లీ పంపిస్తామని తెలిపారు.
Actress Sneha
Actor prasanna

More Telugu News