Teachers: ఉపాధ్యాయుల బదిలీలకు ఓకే చెప్పిన జగన్.. జులై 15 తర్వాత ఆన్‌లైన్ పద్ధతిలో బదిలీల ప్రక్రియ!

CM YS Jagan gave green signal for teachers transfers
  • విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు
  • పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై మ్యాపింగ్ చేయాలన్న సీఎం
  • విద్యార్థులకు మంచి జరిగేలా విధివిధానాల రూపకల్పనకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమంపై బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు విద్యార్థులకు మంచి చేసేలా ఉండాలని అన్నారు. పదో తరగతి పరీక్షల తర్వాత ఆన్‌లైన్‌ పద్ధతిలో బదిలీల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లు ఉండాలన్నారు. ఏయే పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మ్యాపింగ్ చేయాలన్నారు. టీచర్ల రీపొజిషన్‌కు, పిల్లలకు మంచి జరిగేలా విధివిధానాలు రూపొందించాలన్నారు.

టీచర్ల బదిలీలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆయన ఆదేశాల మేరకు జులై 15 తర్వాత ఆన్‌లైన్ విధానంలో టీచర్ల బదిలీలు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. బదిలీల కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూయడానికి వీల్లేదని జగన్ ఆదేశించారని, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేలోపు బదిలీలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
Teachers
Andhra Pradesh
Transfers
YS Jagan

More Telugu News