Andhra Pradesh: ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం.. పలు అంశాలపై చర్చించే అవకాశం

ap cabinet meets
  • ఏపీ సచివాలయంలో భేటీ కానున్న కేబినెట్
  • నీలం సాహ్ని ఉత్తర్వులు
  • ముఖ్యంగా కరోనా గురించి చర్చించే అవకాశం
ఏపీ సీఎం వైఎస్‌ జగన్ నేతృత్వంలో ఈ నెల 11న  ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో ముఖ్యంగా కరోనా గురించి చర్చించే అవకాశం ఉంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన నష్టం, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పలు పథకాల అమలుపై కూడా చర్చించే అవకాశముంది. కాగా, కేబినెట్‌ భేటీలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని ఏపీలోని అన్ని శాఖల అధికారులకు నీలం సాహ్ని సూచించారు.
Andhra Pradesh
AP Cabinet
YSRCP

More Telugu News