Harish Rao: మీ అభిమానానికి కృతజ్ఞతలు... నా పుట్టినరోజు వేడుకలు వద్దు: హరీశ్ రావు

Harish Rao appeals to fans do not celebrate his birthday tomorrow
  • రేపు హరీశ్ రావు జన్మదినం
  • అభిమానులకు, మిత్రులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన హరీశ్
  • కరోనా కారణంగా పుట్టినరోజు జరుపుకోవడంలేదని వెల్లడి
రేపు (జూన్ 3) తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు పుట్టినరోజు. అయితే, కరోనా కష్టకాలంలో తాను పుట్టినరోజు జరుపుకోవడం లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు అభిమానులకు పిలుపునిచ్చారు. మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ ట్వీట్ చేశారు.

'నాకు బర్త్ డే విషెస్ చెప్పడానికి, నన్ను కలిసి ఆశీర్వదిస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ వినమ్రంగా స్పందించారు.  అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఈ సమయంలో అందరం స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
Harish Rao
Birthday
Fans
TRS
Telangana

More Telugu News