Varun Tej: నాగార్జున సిమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వరుణ్ తేజ్

Varun Tej appointed as Nagarjuna Cement brand ambassador
  • హిట్లతో ఊపుమీదున్న వరుణ్ తేజ్
  • వరుణ్ తేజ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు నాగార్జున సిమెంట్ వెల్లడి  
  • వెల్లడికాని ఒప్పందం విలువ!
ఫిదా, గద్దలకొండ గణేశ్ వంటి హిట్లతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తన ఛరిష్మాను సొమ్ము చేసుకునే పనిలో పడ్డాడు. తాజాగా, నాగార్జున సిమెంట్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు నాగార్జున సిమెంట్స్ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ప్రచారకర్తగా వ్యవహరించేందుకు వరుణ్ తేజ్ కు ఎంత మొత్తం ఇస్తున్నారన్నది తెలియరాలేదు. దేశంలో విస్తృతంగా అమ్ముడయ్యే సిమెంట్ బ్రాండ్లలో నాగార్జున సిమెంట్ కూడా ఒకటి.
Varun Tej
Naharjuna Cement
Brand Ambassador
Tollywood

More Telugu News