Pawan Kalyan: ఈ రోజు చారిత్రాత్మకమైనది... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan greets Telangana people on Formation Day
  • నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం
  • కోట్లాది త్యాగాల ఫలితం తెలంగాణ అంటూ పవన్ స్పందన
  • త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నట్టు వెల్లడి
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. వేలాది బలిదానాలతో, కోట్లాది మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు నడిపే నేతలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలపై ఉందన్నారు. కోట్లాది మంది కల సాకారమైన ఈ రోజున తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు.
Pawan Kalyan
Telangana
Formation Day
Sacrifice
State

More Telugu News