Andhra Pradesh: ప్రేమ జంటకు మద్దతుగా నిలిచిన యువకుడిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి!

youngster killed by a girl family
  • కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఘటన
  • ఓ యువతి, యువకుడు ప్రేమాయణం
  • ప్రేమజంటకు మద్దతు పలికిన ప్రవీణ్‌ కుమార్ ‌
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుండంమెట్ట వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి, యువకుడు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతుండడంతో ప్రవీణ్‌ కుమార్‌ అనే యువకుడు ఆ ప్రేమ జంటకు మద్దతుగా నిలిచాడు. వారి ప్రేమకు అతడు సహకరిస్తూ ఉండడంతో యువతి కుటుంబ సభ్యులు అతడిపై కోపం పెంచుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆ యువతి బంధువులు ప్రవీణ్ కుమార్‌పై దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్‌ ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Andhra Pradesh
Kurnool District
Crime News

More Telugu News