Nara Lokesh: ఎందరో అమరవీరుల త్యాగాల ప్రతిఫలం తెలంగాణ రాష్ట్రం: నారా లోకేశ్

lokesh on telangana formation day
  • ట్వీట్ చేసిన లోకేశ్
  • తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు
  • అమరవీరుల స్మృతికి నివాళులర్పిస్తున్నాను
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల త్యాగాలను ఆయన కొనియాడారు. 'తెలంగాణ ఆవిర్భావ సంబురాలను ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు. ఎందరో అమరవీరుల త్యాగాల ప్రతిఫలం తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రావతరణ దినం సందర్భంగా ఆ అమరవీరుల స్మృతికి నివాళులర్పిస్తున్నాను' అని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Nara Lokesh
Telugudesam
Telangana

More Telugu News