Jagan: నేటి ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌

cm jagan delhi toor postpones
  • ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్దామనుకున్న జగన్
  • పలువురు కేంద్రమంత్రులను కలవాల్సిన సీఎం  
  • రాష్ట్రాన్ని ఆదుకోవాలని స్వయంగా కోరాలని భావించిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఈ రోజు ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా ఆయన పర్యటన వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ అవుదామని అనుకున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై అమిత్ షాతో చర్చిద్దామని, అలాగే, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో చర్చించాలని ఆయన‌ భావించారు.

ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీ బయల్దేరాల్సి ఉండగా ఆయన పర్యటన వాయిదా పడింది. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర మంత్రులను కలసి నేరుగా కోరాలని భావించారు.
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News