Maharashtra: మహారాష్ట్రలో దారుణంగా పెరిగిపోతున్న కేసులు.. 70 వేల మార్కు దాటేసిన వైనం!

Corona cases In Maharashtra raised to 70 thousand
  • ప్రతి రోజు వేలల్లో నమోదవుతున్న కేసులు
  • కేసులు, మరణాలలో దేశంలోనే ముందున్న మహారాష్ట్ర
  • సగానికిపైగా కేసులు ముంబైలోనే నమోదు
కరోనాతో మహారాష్ట్ర వణుకుతోంది. ప్రతి రోజు వేలల్లో నమోదవుతున్న కేసులు అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న ఒక్క రోజే 2,361 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 70,013కు చేరుకుంది.

అలాగే, తాజాగా 76 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,362కు పెరిగింది. అటు కేసుల్లోనూ, ఇటు మరణాల్లోనూ దేశంలోనే మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఇక, నిన్న ఒక్క రోజే 779 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 37,543 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60 శాతం ఒక్క ముంబైలోనే వెలుగు చూస్తుండడం గమనార్హం. నగరంలో నిన్న ఒక్క రోజే 1,413 కేసులు వెలుగు చూశాయి. దీంతో ముంబైలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,789కు పెరిగింది.
Maharashtra
Mumbai
Corona Virus

More Telugu News