Telangana: తెలంగాణలో 94 కొత్త కేసులు... అన్నీ లోకల్!

Telangana today witnesses all local cases
  • గత 24 గంటల్లో ఆరుగురి మృతి
  • జీహెచ్ఎంసీ పరిధిలో 79 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కేసుల సంఖ్య 2,792
తెలంగాణలో కరోన మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఈ పర్యాయం బయటి నుంచి వచ్చిన వారెవరికీ కరోనా నిర్ధారణ కాలేదు. అన్నీ లోకల్ కేసులే! జీహెచ్ఎంసీ పరిధిలో 79 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చెల్ 3, మెదక్ 2, నల్గొండ 2, సంగారెడ్డి 2, మహబూబాబాద్ 1, పెద్దపల్లి 1, జనగాం 1 కేసు నమోదయ్యాయి. ఇక, రాష్ట్రంలో మరణాల సంఖ్య 88కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,792 కాగా, 1,491 మంది డిశ్చార్జి అయ్యారు. 1,213 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Telangana
Corona Virus
Positive
Local
COVID-19

More Telugu News