ఏపీలో ఉదయం 6 గంటల నుంచే మొదలైన పెన్షన్ల పంపిణీ!

YSR Penssion Started in AP
  • బయో మెట్రిక్ స్థానంలో ఫొటోల జియో ట్యాగింగ్
  • పెన్షన్ ను అందుకోనున్న 58.22 లక్షల మంది
  • రూ. 1,421 కోట్లను విడుదల చేసిన జగన్ సర్కారు
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ, ఈ తెల్లవారుజామునే ప్రారంభమైంది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ ను అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బయో మెట్రిక్ కి బదులుగా పెన్షనర్ల చిత్రాలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

ఇక రాష్ట్రంలో మొత్తం 58.22 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉండగా, వారికి ఈ నెల పెన్షన్ కోసం ప్రభుత్వం రూ. 1,421.20 కోట్లను విడుదల చేసింది. అన్ని జిల్లాల్లోని 2.37 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఈ డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఒకవేళ లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి పోర్టబిలిటీ విధానంలో పెన్షన్లను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSR Penssion
Jagan

More Telugu News