ఉత్తరాఖండ్ లో మంత్రి భార్యకు కరోనా... మంత్రికి, సిబ్బందికి క్వారంటైన్
- మంత్రి సత్యపాల్ అర్ధాంగి అమృతా రావత్ కు పాజిటివ్
- కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అమృతా
- మంత్రి, ఇతర సిబ్బంది నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు
దాంతో మంత్రిని, ఇతర సిబ్బందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారి నుంచి నమూనాలు తీసుకుని వైద్య పరీక్షలు చేయనున్నారు. అమృతా రావత్ గతంలో మంత్రిగా వ్యవహరించారు. ఆమె కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో రిషికేశ్ లోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఫలితం వచ్చింది.