Asaduddin Owaisi: చైనాతో సరిహద్దులో ఏం జరుగుతోందో కేంద్రం స్పష్టతనివ్వాలి: ఒవైసీ

Owaisi demands Centre to explain  what is happening at China border
  • సరిహద్దులో చైనా, భారత్ సైనికుల ఘర్షణ
  • ప్రతీకారం తీర్చుకోవాలన్న ఒవైసీ
  • పీఎంఓ, రాజ్ నాథ్ వివరణ ఇవ్వాలంటూ డిమాండ్
ఇటీవల సరిహద్దులో చైనా, భారత్ సైనికుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. దీనిపై కేంద్రం గుంభనంగా వ్యవహరిస్తోందంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. చైనాతో సరిహద్దులో ఏం జరుగుతోందో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. చైనా దురాగతాలు నిజమైతే ప్రతీకారం తీర్చుకోవాలని స్పష్టం చేశారు. చైనాతో వివాదంపై ప్రధాని మోదీ కార్యాలయం, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ వివరణ ఇవ్వాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా మోదీ మద్దతుదారులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
Asaduddin Owaisi
China
Border
India
Narendra Modi
Rajnath

More Telugu News