Chiranjeevi: ఉపాసన తాతయ్య అంతిమయాత్రలో తేనెటీగల దాడి... చిరంజీవి, రామ్ చరణ్ లకు తప్పిన ప్రమాదం

Honeybees attacks on Chiranjeevi and Ram Charan
  • బుధవారం మరణించిన కామినేని ఉమాపతిరావు
  • ఆదివారం ఉదయం అంత్యక్రియలు
  • హాజరైన చిరంజీవి కుటుంబ సభ్యులు
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తాతయ్య, దోమకొండ సంస్థాన వారసుడు కామినేని ఉమాపతిరావు (రిటైర్టు ఐఏఎస్ అధికారి) బుధవారం మృతిచెందగా, ఈ ఉదయం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. గడికోట లక్ష్మీబాగ్ లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమం కోసం చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ఇతర బంధువులు హాజరయ్యారు. గడికోట నివాసం నుంచి ఉమాపతిరావు భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ చెల్లాచెదురయ్యారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై చిరంజీవి, రామ్ చరణ్ లను ఇంట్లోకి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. కాసేపటికి తేనెటీగలు శాంతించడంతో అంత్యక్రియలు యథావిధిగా జరిగాయి.
Chiranjeevi
Ramcharan
Upasana
Kamineni Umapathirao

More Telugu News