krishna: అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్: సూపర్ స్టార్‌ కృష్ణకు చిరంజీవి సహా ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

krishna birthday wishes
  • కథానాయకుడిగా 345 సినిమాలు
  • దర్శకుడిగా 14 చిత్రాలు
  • నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో 50 చిత్రాలు
  • మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదేనన్న చిరు
సూపర్ స్టార్‌ కృష్ణకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'కథానాయకుడిగా 345 సినిమాలు.. దర్శకుడిగా 14 చిత్రాలు. నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70ఎంఎం చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూపర్ స్టార్‌ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు' అని చిరంజీవి పేర్కొన్నారు.

కృష్ణకు ఆయన కుమారుడు మహేశ్ బాబు కూడా శుభకాంక్షలు తెలిపారు. 'నాన్న నా ఎవర్‌గ్రీన్‌ సూపర్' అని పేర్కొన్నారు. ‌హ్యాపీ బర్త్ డే తాతగారూ అంటూ మహేశ్ బాబు కుమారుడు గౌతం కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పలువురు సినీ ప్రముఖులు, టీడీపీ నేత గల్లా జయదేవ్ కృష్ణకు శుభాకాంక్షలు చెప్పారు.
krishna
Chiranjeevi
Mahesh Babu

More Telugu News