Vani Mohan: ఏపీలో మరో కీలక పరిణామం.. ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్ నియామకం

AP govt appoints G Vani Mohan as Secretary of State Election Commission
  • నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ 
  • పలు శాఖల అదనపు బాధ్యతలు కూడా
  • ప్రస్తుతం ఇన్‌చార్జ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జీవీఎస్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సహకార శాఖ కమిషనర్ జి.వాణీమోహన్‌ను ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, సహకార శాఖ కమిషనర్, ఏపీ డెయిరీ అభివృద్ధి సమాఖ్య ఎండీ, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం జీవీఎస్ ప్రసాద్ ఎన్నికల కమిషన్‌ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా ఉన్నారు. వాణీమోహన్ 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.
Vani Mohan
Andhra Pradesh
Secretary of State Election Commission

More Telugu News