India: ట్రంప్ మధ్యవర్తిత్వం ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిన భారత్

India rejects Trump mediation proposal in China issue
  • సరిహద్దుల్లో భారత్, చైనా ఉద్రిక్తతలు
  • మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్
  • తాము పరిష్కరించుకోగలమన్న కేంద్రం
భారత్, చైనా బలగాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద తాజా ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమంటూ ప్రతిపాదనలు పంపారు. అయితే, చైనాతో తాము ఈ వ్యవహారాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.

ఇటు ఢిల్లీలోనూ, అటు బీజింగ్ లోనూ చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఈ చర్చలు దౌత్య స్థాయిలోనూ, సైనిక వర్గాల స్థాయిలోనూ చేపట్టినట్టు వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, నిశ్చింత వాతావరణం నెలకొల్పేందుకు ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ గతంలోనూ ఇదే విధంగా భారత్, పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వానికి విపరీతమైన ఆసక్తి చూపినా, ఆ ప్రతిపాదనను కేంద్రం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
India
China
Donald Trump
Mediation

More Telugu News