Balakrishna: బాలయ్యను కమెడియన్ అని అనలేదు.. ఆయనతో నాకు శత్రుత్వం లేదు: నాగబాబు

I never called Balakrishna as comedian says Nagababu
  • బాలయ్యతో నాకు శత్రుత్వం లేదు
  • ఆయనను మీటింగ్ కు పిలవాలని నేను కూడా  చెపుతున్నా
  • భూములు పంచుకున్నారని అనడం మాత్రం సరికాదు
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మంత్రి తలసానితో కూర్చొని భూములు పంచుకున్నారా? అంటూ ప్రభుత్వంతో చర్చలు జరిపిన సినీ ప్రముఖులను ఉద్దేశించి బాలయ్య వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బాలయ్యపై నాగబాబు విమర్శలు గుప్పించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. మరోవైపు, ఓ టీవీ చానల్ తో నాగబాబు మాట్లాడుతూ బాలయ్యతో తనకు శత్రుత్వం లేదని, ఆయనతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు.

భూములు పంచుకున్నారని బాలయ్య అనడం మాత్రం తప్పేనని నాగబాబు అన్నారు. బాలయ్యతో వ్యక్తిగత ద్వేషంతోనే మీరు ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన అభిమానులు అంటున్నారని ... గతంలో ఆయనను కమెడియన్ అని మీరు కామెంట్ చేశారన్న ఏబీఎన్ ప్రశ్నకు సమాధానంగా... తాను ఎప్పుడూ ఆయనను కమెడియన్ అనలేదని చెప్పారు. బాలయ్యపై తనకు నెగెటివ్ ఒపీనియన్ లేదని అన్నారు. బాలకృష్ణను కూడా సమావేశానికి పిలవాలని తాను బలంగా చెపుతున్నానని తెలిపారు. మీటింగ్ కు ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించడంలో తప్పు లేదని... అయితే భూములు పంచుకున్నారని అనడం మాత్రం సరిగా లేదని చెప్పారు.

ఎవరైనా భూములు తీసుకుని ఉంటే వారి పేరు చెప్పి విమర్శించవచ్చని నాగబాబు అన్నారు. ఒకప్పుడు నిర్మాతగా యాక్టివ్ గా ఉన్నానని... ఇప్పుడు యాక్టివ్ గా లేనని చెప్పారు. అయితే, ఎవరైనా ఇబ్బందికరంగా మాట్లాడితే మాత్రం ప్రశ్నిస్తానని అన్నారు.
Balakrishna
Nagababu
Tollywood
Talasani
TRS

More Telugu News