ఎన్టీఆర్, చిరంజీవి సినిమా స్టిల్ ను పంచుకున్న రామ్ చరణ్
- ఇవాళ ఎన్టీఆర్ జయంతి
- ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన రామ్ చరణ్
- తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకువచ్చారంటూ ట్వీట్
"తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకువచ్చిన ఆ మహనీయుడ్ని గుర్తు చేసుకుందాం. మహోన్నతుడైన ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా వేడుక చేసుకుందాం" అంటూ ట్విట్టర్ లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి, ఎన్టీఆర్ తో కలిసి నటించిన 'తిరుగులేని మనిషి' చిత్రంలోని ఓ స్టిల్ ను కూడా పంచుకునున్నారు. 1981లో వచ్చిన తిరుగులేని మనిషి చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.