padma devendar redddy: బోరుబావిలో చిన్నారి మృతిపై స్పందించి కన్నీళ్లు పెట్టుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి

padma devendar reddy breaks down
  • నిన్న మెదక్‌ జిల్లాలో ఘటన
  • ఇలాంటి ఘటనలు మరోసారి జరగొద్దన్న పద్మ
  • నీళ్లు పడని బోరుబావులను పూడ్చివేయాలి
మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం బోరుబావిలో పడిన మూడేళ్ల సాయివర్థన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ జిల్లాలోని పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కన్నీరు కార్చారు.

ఇలాంటి ఘటనలు మరోసారి జరగొద్దని అన్నారు. నీళ్లు పడని బోరుబావులను రైతులు, స్థానిక అధికారులు పూడ్చివేయాలని కోరారు. కాగా, స్థానిక అధికారులు, రిగ్‌ యజమానుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని  బాలల హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. అలాగే, సహాయక సిబ్బంది కూడా ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు వాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
padma devendar redddy
TRS
Telangana

More Telugu News