కుప్పలు తెప్పలుగా చచ్చిపడిన గబ్బిలాలు... యూపీ వాసుల్లో తీవ్ర భయం!
- గోరఖ్ పూర్ సమీపంలో ఘటన
- ఎండలు ఎక్కువ కావడంతోనే గబ్బిలాల మృతి
- ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు
ఈ ప్రాంతంలో ఎండలు సగటుతో పోలిస్తే, చాలా ఎక్కువగా వున్న కారణంగానే గబ్బిలాలు చనిపోయాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు డివిజనల్ ఫారెస్ట్ హెడ్ అవినాష్ కుమార్ వెల్లడించారు. ఉష్ణోగ్రత 46 డిగ్రీల వరకూ ఉందని, తాగేందుకు నీరు లేకనే అవి చనిపోయి వుండవచ్చని తెలిపారు. మృతి చెందిన గబ్బిలాలను తదుపరి పరీక్షల నిమిత్తం వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు పంపించామని తెలియజేశారు.