కుప్పలు తెప్పలుగా చచ్చిపడిన గబ్బిలాలు... యూపీ వాసుల్లో తీవ్ర భయం!

Thousands of Bats Died in Uttar Pradesh
  • గోరఖ్ పూర్ సమీపంలో ఘటన
  • ఎండలు ఎక్కువ కావడంతోనే గబ్బిలాల మృతి
  • ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు
అసలే కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందన్న భయం ప్రజల్లో నెలకొన్న వేళ, యూపీలోని గోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి వుండటాన్ని చూసిన ప్రజలు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక్కడికి సమీపంలోని బేల్ గాట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు పడివుండటాన్ని చూసిన స్థానికులు, కరోనా కారణంగానే అవి మరణించాయని భావించారు. ఈ వార్త ఆనోటా, ఈనోటా దావానలంలా వ్యాపించింది. కొందరు వెటర్నరీ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు సైతం హుటాహుటిన ఆ స్థలానికి వచ్చారు.

ఈ ప్రాంతంలో ఎండలు సగటుతో పోలిస్తే, చాలా ఎక్కువగా వున్న కారణంగానే గబ్బిలాలు చనిపోయాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు డివిజనల్‌ ఫారెస్ట్‌ హెడ్‌ అవినాష్‌ కుమార్‌ వెల్లడించారు. ఉష్ణోగ్రత 46 డిగ్రీల వరకూ ఉందని, తాగేందుకు నీరు లేకనే అవి చనిపోయి వుండవచ్చని తెలిపారు. మృతి చెందిన గబ్బిలాలను తదుపరి పరీక్షల నిమిత్తం వెటర్నరీ రీసెర్చ్‌ ఇని‌స్టిట్యూట్ కు‌ పంపించామని తెలియజేశారు.
Go Back to Shorts
Bats
Gorakhpur
Uttar Pradesh
Died

More Telugu News