Air Asia: హైదరాబాదులో అత్యవసరంగా ల్యాండైన ఎయిర్ ఏషియా విమానం

Air Aisa plane landed emergency in Hyderabad
  • విమానం నుంచి ఇంధనం లీక్
  • ఓ ఇంజిన్ ఆపేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • తృటిలో తప్పిన ప్రమాదం
ఎయిర్ ఏషియా విమానయాన సంస్థకు చెందిన విమానం తృటిలో ప్రమాదం తప్పించుకుంది. జైపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ ప్రయత్నంలో ఉండగా ఇంధనం లీకవుతున్నట్టు గుర్తించారు. దాంతో విమానంలోని ఒక ఇంజిన్ ను ఆపేసి, ఇక్కడి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని కిందికి దింపారు. ఆ సమయంలో విమానంలో 70 మంది ప్రయాణికులున్నారు.

దీనిపై ఎయిర్ ఏషియా ప్రతినిధి స్పందిస్తూ, విమానంలో ఏర్పడ్డ లోపాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఘటనపై డీజీసీఏకి సమాచారం అందించామని తెలిపారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు దారితీసిన పరిణామాలపై జరుగుతున్న విచారణలో సహకరిస్తామని వెల్లడించారు.
Air Asia
Plane
Hyderabad
Emergency Landing
Fuel Leak

More Telugu News