Nandigam Suresh: హైకోర్టు తీర్పుపై వైసీపీ నేతల విమర్శలు.. ఎంపీ సహా 49 మందికి న్యాయస్థానం నోటీసులు!

AP High Court issues notices to 49 YSRCP leaders
  • నందిగం సురేష్, ఆమంచిలకు నోటీసులు
  • నేతల వ్యాఖ్యలను పరిశీలించిన హైకోర్టు
  • కోర్టు తీర్పులపై విమర్శలను తప్పు పట్టిన వైనం
జడ్జిలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచితో పాటు 49 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జడ్జిలపై నేతలు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

విచారణ సందర్భంగా టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కోర్టు తీర్పులపై వారు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు పరిశీలించింది. కోర్టు తీర్పులపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టింది. అనంతరం నోటీసులను జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పును పలువురు వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శించారు.
Nandigam Suresh
Amanchi
AP High Court

More Telugu News