AP High Court: ఏపీలో ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టులో విచారణ ఈ నెల 28కి వాయిదా

High Court adjourned assets selling petition hearing
  • ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టులో పిల్
  • విచారణ చేపట్టిన న్యాయస్థానం
  • ఉన్న భూములు అమ్ముకోవడం ఏంటన్న న్యాయస్థానం
ఏపీలో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారంటూ, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ గుంటూరు సామాజిక కార్యకర్త సురేశ్ బాబు హైకోర్టులో దాఖలు చేసిన పిల్ పై నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వ్యవధి కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అనేక విధాలా తప్పుబట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఓవైపు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేస్తూ, మరోవైపు ప్రభుత్వ భూములు అమ్ముకోవడం ఏంటి? అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందని వివరించారు. ఆదాయం కోసం ఇతర మార్గాలు అన్వేషించాలి కానీ, ప్రభుత్వ భూములు అమ్ముకోవడం సబబు కాదని హితవు పలికిందని న్యాయవాది తెలిపారు.
AP High Court
Assets
Andhra Pradesh
Hearing

More Telugu News