హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎదురుదెబ్బ తిన్న ఎల్జీ పాలిమర్స్
- ప్లాంట్ మూసివేయాలన్న ఏపీ హైకోర్టు
- ప్లాంట్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అనుమతించాల్న ఎల్జీ పాలిమర్స్
- ఎన్జీటీ/హైకోర్టు విచారణలు పూర్తయ్యాకే తమ వద్దకు రావాలన్న సుప్రీం
అంతేగాకుండా, గ్యాస్ లీక్ వ్యవహారంపై ఏడు కమిటీలు ఏర్పాటు చేశారని, ఏ కమిటీ ముందు హాజరవ్వాలో తమకు అర్థంకావడంలేదని ఎల్జీ పాలిమర్స్ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించింది. దీనికి సుప్రీం ధర్మాసనం బదులిస్తూ, ఎన్జీటీ లేదా హైకోర్టు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాయని, ఆయా విచారణలు ముగిసిన తర్వాతే సుప్రీం కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఇక, ఈ పిటిషన్ పై తాము తదుపరి విచారణ చేపట్టలేమంటూ ఎల్జీ పాలిమర్స్ కు తేల్చి చెప్పింది.