వైరస్ పై మేం ఎలాంటి పరిశోధనలు నిర్వహించలేదు... ఎలా లీకవుతుంది?: వుహాన్ ల్యాబ్
- వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా లీకైందన్న అమెరికా
- అమెరికా వన్నీ కట్టుకథలంటూ కొట్టిపారేసిన వుహాన్ ల్యాబ్ డైరెక్టర్
- ఇలాంటి వైరస్ ఉంటుందని తమకు తెలియదని వివరణ
అమెరికా ఆరోపణల్లో నిజంలేదని, అమెరికా కల్పిత గాథలు వినిపిస్తోందని స్పష్టం చేశారు. ఇలాంటి వైరస్ ఉందన్న విషయం కూడా తమకు తెలియదని, అలాంటప్పుడు ఏ విధంగా పరిశోధన చేస్తామని అన్నారు. మాకు తెలియని వైరస్ ను ఏ విధంగా ల్యాబ్ లో ఉంచుతాం, అది ఏ విధంగా లీకవుతుంది? అని వాంగ్ యాన్ యీ ప్రశ్నించారు. తమ ల్యాబ్ లో ఉన్న వైరస్ లలో కొన్ని గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతాయని, కానీ ఆ వైరస్ ల జన్యుక్రమంతో కరోనా వైరస్ కు పోలికేలేదని స్పష్టం చేశారు.