ou: ఓయూలో కాంగ్రెస్ నేతల పర్యటన.. ఉద్రిక్తత
- భూములను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు
- కబ్జా అయిన భూములను చూస్తామన్న వీహెచ్
- కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
- వారితో వీహెచ్ వాగ్వివాదం
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని భూములను పరిశీలించడానికి కాంగ్రెస్ నేతలు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఓయూలో కబ్జా అయిన భూములను చూడడానికి వారు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వారితో వీహెచ్ వాగ్వివాదానికి దిగారు. వర్సిటీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని మండిపడ్డారు. తమను అడ్డుకోవడం సరికాదని చెప్పారు.
భూములను పరిశీలించడానికి వెళ్లినవారిలో వీహెచ్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్‌రెడ్డి కూడా ఉన్నారు. ఓయూ భూముల్లో కొందరు నిర్మాణాలు చేపడుతుండడం పట్ల వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ భూములను సందర్శించడానికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ... ఓయూ భూములపై తాము త్వరలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుస్తామని తెలిపారు. ఓయూ భూముల ఆక్రమణను అడ్డుకుంటామని చెప్పారు.