క్రీడా పోటీల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర క్రీడల మంత్రి
- భారత్ లో కరోనా విజృంభణ
- ఇప్పట్లో అంతర్జాతీయ ఈవెంట్లు కష్టమేనన్న కిరణ్ రిజిజు
- ఐపీఎల్ నిర్వహించాలని కోరుకుంటున్న బీసీసీఐ
ఇప్పటికే వాయిదా పడిన ఐపీఎల్ ను అక్టోబరులో కానీ, నవంబరులో కానీ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐకి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు తీవ్ర నిరాశ కలిగించేవే! ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడితే, ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించాలన్నది బీసీసీఐ ప్లాన్. కానీ కేంద్రం ఆలోచనలు చూస్తే, సమీప భవిష్యత్తులో భారత్ లో ఓ అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహించడం కష్టమేనని అర్థమవుతోంది.