Sanchita Gajapati Raju: 'మూడు లాంతర్ల స్తంభం'పై మా బాబాయి అశోక్ గజపతిరాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సంచయిత

Sanchaita sensational comments on her uncle Ashok Gajapathi Raju
  • విజయనగరంలో కలకలం
  • మూడు లాంతర్ల స్తంభం కూల్చివేశారంటూ అశోక్ గజపతిరాజు విచారం
  • అవి పునరుద్ధరణ పనులేనన్న సంచయిత
విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేశారంటూ టీడీపీ మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు తీవ్ర విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చారిత్రక కట్టడం అని, చరిత్రను ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. దీనిపై ఆయన సోదరుడి కుమార్తె, మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ఘాటుగా స్పందించారు. విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై తన బాబాయి అశోక్ గజపతిరాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ ప్రచారంలో పాలుపంచుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం ఉన్న ప్రదేశంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, ఇదీ వాస్తవం అని వెల్లడించారు. పనులు పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారని సంచయిత వెల్లడించారు. అంతేకాదు, ఓ గదిలో భద్రపరిచిన మూడు లాంతర్ల స్తంభం ఫొటోను కూడా పంచుకున్నారు.
Sanchita Gajapati Raju
Ashok Gajapati Raju
Chandrababu
Three Lantern Tower
Vijayanagaram
Andhra Pradesh

More Telugu News