Mahesh Babu: మామయ్యా... మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి: మహేశ్ బాబు

Mahesh Babu greets Raghavendra Rao
  • నేడు రాఘవేంద్రరావు పుట్టినరోజు
  • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహేశ్
  • మీతో పని చేసిన అనుభవాన్ని మర్చిపోలేనని వ్యాఖ్య
తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో  తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబుకు తొలి చిత్రంతోనే రాఘవేంద్రరావు ఘన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

'హ్యాపీ బర్త్ డే మామయ్య. మీలాంటి గొప్ప దర్శకుడితో పని చేసిన అనుభవాన్ని మర్చిపోలేను. మీరెప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలి' అని ట్వీట్ చేశారు. 'రాజకుమారుడు' షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోను షేర్ చేశాడు.
Mahesh Babu
Raghavendra Rao
Tollywood

More Telugu News