జగన్ ఫ్యామిలీ ఫొటో షేర్ చేసి.. శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- వైసీపీ విజయానికి నేటితో ఏడాది
- చెప్పనివి కూడా చేశారంటూ జగన్ పై వైవీ ప్రశంసలు
- చిరస్థాయిగా నిలిచిపోవాలంటూ ఆకాంక్ష
గత 12 నెలల కాలంలో నవరత్నాలే కాకుండా, చెప్పనివి కూడా చేసి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రజానాయకుడు మన వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. 'జగన్ మున్ముందు మరెన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను' అంటూ వ్యాఖ్యానించారు. ఈ శుభదినాన అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.