'చారిత్రక విజయానికి ఏడాది' అంటూ వైసీపీ సంబరం!
- రేపటితో వైసీపీ విజయానికి ఏడాది పూర్తి
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ
- విశ్వసనీయతకు పట్టం కట్టిన రోజంటూ జగన్ పై క్లిప్పింగ్స్
సరిగ్గా గతేడాది మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రేపు మే 23 కావడంతో చారిత్రక విజయానికి ఏడాది అంటూ వైసీపీ ట్విట్టర్ లో పేర్కొంది. రాజన్న బిడ్డ, జనహృదయ నేత అంటూ సీఎం జగన్ ను కొనియాడింది. అంతేకాదు, విశ్వసనీయతకు పట్టం కట్టి రేపటికి ఏడాది అంటూ కొన్ని వీడియో క్లిపింగ్స్ ను కూడా పంచుకుంది.