Kanna Lakshminarayana: డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై సీఎం జగన్ కు లేఖ రాసిన కన్నా

AP BJP President Kanna writes to CM Jagan over Dr Sudhakar issue
  • డాక్టర్ ను సస్పెండ్ చేయడం దారుణమన్న కన్నా
  • ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్
  • ప్రశ్నించే వ్యక్తులపై ఇలాంటి చర్యలు సబబు కాదని హితవు
విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల వ్యవహార శైలిని హైకోర్టు కూడా తప్పుబట్టిందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. మాస్కులు కావాలని అడిగిన డాక్టర్ సుధాకర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమని, హైకోర్టు తీర్పును చూసైనా ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. డాక్టర్ వ్యవహారంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదన్న విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రశ్నించే వ్యక్తులపై ఇలాంటి చర్యలు సబబు కాదని కన్నా హితవు పలికారు. హైకోర్టు నిర్ణయంతోనైనా రాష్ట్ర సర్కారు మేల్కొనాలని సూచించారు.
Kanna Lakshminarayana
Jagan
Letter

More Telugu News