Chandrababu: డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

TDP Chief Chandrababu welcomes High Court decision on Dr Sudhakar issue
  • డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ
  • కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో తీర్పు
  • సీబీఐ దర్యాప్తుతో ప్రభుత్వ కుట్ర బయటపడడం ఖాయమన్న చంద్రబాబు
విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు. ఎన్-95 మాస్కు అడిగినందుకు ఓ డాక్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తూ, నిర్బంధించడమే కాకుండా, పోలీసులతో హింసకు పాల్పడ్డారని, దీని వెనకున్న ప్రభుత్వ కుట్ర సీబీఐ దర్యాప్తుతో వెల్లడవుతుందని తాము గట్టిగా నమ్ముతున్నట్టు తెలిపారు.
Chandrababu
Dr Sudhakar
AP High Court
CBI
Vizag
Andhra Pradesh

More Telugu News