American Actor: ప్రేయసిపై కాల్పులు జరిపి .. ఆత్మహత్యకు పాల్పడ్డ అమెరికా నటుడు

Actor Hagen Mills Kills Himself After Trying to Murder His Girlfriend
  • అమెరికాలోని కెంటకీలో దారుణం
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హ్యాగెన్ మిల్స్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియురాలు
అమెరికా నటుడు హ్యాగెన్ మిల్స్ దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలిపై కాల్పులు జరిపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమెరికాలోని కెంటకీలో ఈ ఘటన చోటు చేసుకుంది. హ్యాగెన్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దారుణ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ప్రియురాలు ఎరికా ప్రైస్ ఛాతీలోకి తుపాకీతో కాల్చిన హ్యాగెత్ ... ఆ తర్వాత తన తలలోకి కాల్చుకున్నాడు. దీంతో, అతను అక్కడికక్కడే మరణించాడు. మరోవైపు ఎరికా పరిస్థితి విషమంగా ఉంది. ఆమె చేయి, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల ఘటన జరిగిన సమయంలో వారి నాలుగేళ్ల కూతురు కూడా అక్కడే ఉంది.

హ్యాగెన్ కు అమెరికాలో మంచి ప్రేక్షకాదరణ ఉంది. బాస్కెట్ వెబ్ సిరీస్ లో అద్భుతమైన నటనతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టీవీ సీరియళ్లు, రెండు చిత్రాల్లో కూడా నటించాడు.
American Actor
Hagen Mills
Girl Friend
Fire
Suicide

More Telugu News