గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ప్రారంభం కానున్న విమాన సర్వీసులు
- సోమవారం నుంచి ప్రారంభం కానున్న దేశీయ విమాన సర్వీసులు
- ఎయిర్ పోర్టులను సిద్ధంగా ఉంచాలన్న కేంద్ర విమానయాన మంత్రి
- ప్రయాణికులకు మార్గదర్శకాలను విడుదల చేస్తామన్న మంత్రి
లాక్ డౌన్ సమయంలో కార్గో విమానాలు, వైద్యపరమైన అవసరం ఉన్న విమానాలు మాత్రమే తిరిగాయి. విదేశాలలో చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. సాధారణ ప్రయాణికులకు మాత్రం సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు, రైలు, బస్సు సేవలు ప్రారంభం కావడంతో... విమాన సర్వీసులు కూడా ప్రారంభించాలని ప్రభుత్వానికి విన్నపాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానాలు తిరిగేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.