Ram Gopal Varma: నాగబాబు వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా: రామ్ గోపాల్ వర్మ

I support Nagababu on his comments on Godse says Ram Gopal Varma
  • గాంధీని గాడ్సే ఎందుకు చంపాడో ఎవరూ చెప్పరు
  • కారణం తెలియకపోవడం వల్లే గాడ్సే విలన్ అయ్యాడు
  • గాడ్సే కథతో సినిమా తీస్తా
గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయనకు అనూహ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మద్దతు లభించింది.

గాంధీని నాథూరాం గాడ్సే చంపాడని మాత్రమే చెబుతున్నారని... అయితే, ఎందుకు చంపాడనే విషయాన్ని మాత్రం ఎవరూ ఎందుకు చెప్పడం లేదని వర్మ ప్రశ్నించారు. గాంధీని ఎందుకు చంపాడనే విషయం తెలియకపోవడం వల్లే... గాడ్సే అందరి దృష్టిలో విలన్ గా మారిపోయాడని అన్నారు. వాస్తవానికి గాంధీకి గాడ్సే ఫాలోయర్ అని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం రావడం, భారత్-పాక్ విడిపోవడం రెండూ గాడ్సే కోరుకున్నాడని.. అవి రెండూ జరిగాయని... అయినా ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాన్ని అప్పటి ప్రభుత్వం బయటకు రానివ్వలేదని చెప్పారు.

అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో గాంధీని ఎందుకు చంపాడనే విషయాన్ని బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదని భావించి ఉండొచ్చని వర్మ అన్నారు. ఏదేమైనా గాడ్సేకి ఉన్న దేశభక్తి విషయంలో నాగబాబుతో తాను పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పారు. గాడ్సే కథతో తాను ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తానని తెలిపారు.
Ram Gopal Varma
Gandhi
Godse
Tollywood
Nagababu

More Telugu News