Corona Virus: ఆంధ్రప్రదేశ్‌లో మరో 68 మందికి కరోనా నిర్ధారణ

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9,159 శాంపిళ్లను పరీక్షించగా మరో 68 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 43 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, కర్నూలులో ఒకరు మృతి చెందారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,407 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,639 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 53కి చేరింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News