వందేభారత్ మిషన్-2: లండన్ నుంచి గన్నవరం చేరుకున్న 143 మంది
- విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు
- బస్సుల ద్వారా ఆయా జిల్లాలకు తరలింపు
- జిల్లా కేంద్రాల్లో పెయిడ్, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు
వివిధ జిల్లాలకు చెందిన వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా ఆ జిల్లా కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ వారి స్తోమతను బట్టి పెయిడ్, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు. వందే భారత్ మిషన్ తొలి విడతలో వివిధ దేశాల నుంచి భారతీయులను తరలించిన కేంద్రం.. శనివారం ప్రారంభమైన రెండో విడతలో భాగంగా మరిన్ని దేశాల నుంచి భారతీయులను తరలిస్తోంది. ఈ నెల 22 వరకు రెండో దశ కొనసాగనుంది. ఇందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఎయిరిండియా విమానాలు తరలివెళ్లాయి.