PhD Student: హైదరాబాదులో పీహెచ్ డీ విద్యార్థి అనుమానాస్పద మృతి

PhD Student dies in suspicious conditions
  • ఉరేసుకున్న స్థితిలో కనిపించిన యువకుడు
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి
  • సంఘటన స్థలంలో కనిపించని సూసైడ్ నోట్
హైదరాబాదులో గోగుల రవీందర్ అనే పీహెచ్ డీ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో  విగత జీవుడై కనిపించాడు. ఉద్యోగాన్వేషణలో విఫలం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. రవీందర్ బోడుప్పల్ లోని ద్వారకానగర్ లో నివాసముంటున్నాడు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లీషు సబ్జెక్టులో పీహెచ్ డీ పూర్తి చేసిన రవీందర్ ఇంటి వద్దే ఉంటున్నాడని, ఇంతవరకు ఉద్యోగం రాలేదని రవీందర్ భార్య రజిత తెలిపారు.

సోమవారం సాయంత్రం తాను వంటగదిలో పనిచేసుకుంటుండగా, రవీందర్ బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకున్నాడని భార్య రజిత వెల్లడించింది. ఎంతకీ తెరవకపోవడంతో కిటికీ తెరిచి చూడగా, సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడని, ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి, రవీందర్ ను ఆసుపత్రికి తరలించామని రజిత పేర్కొంది. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారని తన ఫిర్యాదులో వివరించింది. అయితే, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు.
PhD Student
Hyderabad
Death
Hang

More Telugu News